Header Banner

జైశంకర్ సంచలన కామెంట్స్! ఇకపై భారత్ - పాక్ ఒప్పందాలు..

  Thu May 22, 2025 14:41        India

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య సంధికి మధ్యవర్తిత్వం విషయంలో అమెరికా పాత్రపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ (S Jaishankar) తాజాగా స్పందించారు. కాల్పుల విరమణపై రెండు దేశాలు నేరుగా చర్చలు జరిపాయన్నారు. మే 10న జరిగిన అవగాహన ఒప్పందం న్యూఢిల్లీ-ఇస్లామాబాద్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమని స్పష్టం చేశారు. రెండు దేశాల ప్రతినిధులు హాట్‌లైన్‌ ద్వారా చర్చించినట్లు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.

 

కాగా, భారత్‌-పాక్‌ అణుయుద్ధాన్ని ఆపానని, కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి తానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) తొలి నుంచీ ప్రచారం చేసుకుంటున్న విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య సంధి తన ఘనతే అని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియలో అమెరికా పాత్రపై జైశంకర్‌కు ప్రశ్న ఎదురైంది. ‘ఈ ప్రక్రియలో అమెరికా ఎక్కడ ఉంది..? అని జైశంకర్‌ను ప్రశ్నించగా.. ‘అమెరికా.. అమెరికాలోనే ఉంది’ అంటూ సూటిగా బదులిచ్చారు. ఉద్రిక్తల సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ప్రధాని మోదీతో మాట్లాడినట్లు చెప్పారు. ఆ దేశ విదేశాంగ మంత్రి తనతో ఫోన్‌లో సంభాషించినట్లు చెప్పారు. అమెరికానే కాకుండా పశ్చిమాసియా, ఇతర దేశాల నాయకులు కూడా ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో భారత్‌ను సంప్రదించినట్లు జైశంకర్‌ చెప్పుకొచ్చారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు దసరా బంపర్ ఆఫర్! మంత్రి కీలక ప్రకటన! 

 

ఏవైనా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు.. ఇతర దేశాలు సంప్రదింపులు జరపడం సహజమే అని పేర్కొన్నారు. మే 10న జరిగిన అవగాహన ఒప్పందం న్యూఢిల్లీ-ఇస్లామాబాద్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు.. ప్రపంచంలోని ఇతర దేశాలు సంప్రదించి తమ ఆందోళనను తెలియజేయడం సహజం. కానీ, కాల్పుల విరమణ, సైనిక చర్యలను నిలిపివేయడం అనేది పూర్తిగా భారత్‌-పాక్‌ మధ్య నేరుగా జరిగిన చర్చల ఫలితం. మే 10న పాక్‌ ఆర్మీ నుంచి మాకు ఒక సందేశం వచ్చింది. ఫైరింగ్ ఆపడానికి తాము సిద్ధంగా ఉన్నామని దాని సారాంశం. దీనిపై రెండు దేశాల ప్రతినిధులు హాట్‌లైన్‌ ద్వారా చర్చలు జరిపారు’ అని జైశంకర్‌ స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు దసరా బంపర్ ఆఫర్! మంత్రి కీలక ప్రకటన! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్! నేడు హైకోర్టు కీలక నిర్ణయం! 

 

ట్రంప్ కు బిగ్ షాక్.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పెద్ద కుమారుడు! రిపబ్లికన్ పార్టీ సంచలన నిర్ణయం!

 

అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..! 

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

 

ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

నేడు (22/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jaishankar #IndiaPakistan #DiplomaticRelations #IndiaPakistanTalks #BreakingNews